కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలపై సీబీఐ విచారణ మొదలుపెట్టింది. అయితే, ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పేరును కూడా పీసీ ఘోష్ కమిషన్ చేర్చింది. అయితే ఆ విషయాన్ని సవాల్ చేస్తూ స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా స్మితా సబర్వాల్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఘోష్ కమిషన్ ఆధారంగా స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఘోష్ కమిషన్ నివేదికపై విచారణను కోర్టు వాయిదా వేసింది.కాళేశ్వరంపై విచారణలో తన వివరణ కోరలేదని, నోటీసులు ఇవ్వలేదని స్మితా సబర్వాల్ ఆరోపించారు. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని ఆమె సవాల్ చేశారు ఆ నివేదికను కొట్టివేయాలని, ఆ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని స్మితా సబర్వాల్ కోరారు.
అయితే, కాళేశ్వరం నిర్మాణాలపై స్మితా సబర్వాల్ రివ్యూ చేశారని ఘోష్ కమిషన్ పేర్కొంది. కొన్ని జిల్లాల్లో తిరిగి ఫీడ్ బ్యాక్ ను ఎప్పటికప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు స్మితా సబర్వాల్ చేరవేశారని కమిషన్ ఆరోపించింది. సీఎంఓ స్పెషల్ సెక్రటరీ హోదాలో మూడు బ్యారేజీలను స్మితా సబర్వాల్ సందర్శించారని ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఇచ్చేందుకు స్మితా సబర్వాల్ కీలకపాత్ర పోషించారని వెల్లడించింది.