సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `ఓజీ` చిత్రం భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న విడుదలైన సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. రిలీజ్‌కు ముందే అద్భుతమైన హైప్ క్రియేట్ చేసుకున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సెట్ చేస్తోంది. కళ్లు చెదిరే కలెక్షన్స్ తో దుమ్ముదులుపుతోంది.
మొదటి రోజు పవర్ స్టార్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో అల్టిమేట్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఓజీ.. ఫస్ట్ డే రూ. 27 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. అలాగే సీడెడ్ లో రూ. 8.5 కోట్లు, ఉత్తరాంద్రలో రూ. 7.2 కోట్లు, గుంటూరులో రూ. 7 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 8.3 కోట్లు, పశ్చిమలో రూ. 4.11 కోట్లు, కృష్ణలో రూ. 4.8 కోట్లు వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్‌గా ఏపీ మరియు తెలంగాణలో తొలి రోజు ఓజీ సినిమా ఏకంగా రూ. 70 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వరల్డ్ వైడ్ గా రూ. 105 కోట్లు వసూల్ చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ డేనే 100 కోట్ల మార్క్ ను టచ్ చేసి పవన్ అరుదైన రికార్డును అందుకున్నాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరి ఫుల్ రన్‌లో ఓజీ ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబడుతుందో.. ఎటువంటి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి.