గడిచిన కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో... ముఖ్యంగా హైదరాబాద్ మహానగర రాజకీయాలకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం తరచూ చర్చగా మారింది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాగంటి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో.. ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారన్న దానిపై కొంత గందరగోళం చోటు చేసుకున్నా.. ఎప్పుడైతే కేటీఆర్ జూబ్లీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణికే టికెట్ అని స్పష్టం చేయటంతో.. గులాబీ అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది.
తాజాగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ఎంపిక చేస్తూ.. గులాబీ బాస్ కేసీఆర్ అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. అధికార కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.ఇప్పటికే పలుపేర్లు తెర మీదకు వచ్చినా.. నవీన్ యాదవ్.. దానం నాగేందర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ తాజా నిర్ణయాన్ని చూస్తే.. జూబ్లీ ఉప ఎన్నికల వేళ సెంటిమెంట్ కే కేసీఆర్ ఓటేసిన వైనం కనిపిస్తుంది.
దీంతో..జూబ్లీ ఉప ఎన్నికల్లో మాగంటి అకస్మిక మరణంతో ఉన్న సానుభూతిని సొంతం చేసుకోవటానికి ఆయన సతీమణికే టికెట్ ఫైనల్ చేసిన కేసీఆర్.. సెంటిమెంట్ తప్పించి మరే అంశానికి తాను ప్రాధాన్యత ఇస్తున్న వైనాన్ని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. సునీత ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లుతెలుస్తోంది. ఉప ఎన్నికకు సంబంధించిన అన్నీ అంశాల్ని తామే సొంతంగా పర్యవేక్షిస్తామని.. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్న హామీని ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. జూబ్లీ ఉప ఎన్నిక అంశంలో ఇప్పుడు సీఎం రేవంత్ నిర్ణయం ఏమై ఉంటుందన్నది ప్రశ్నగామారింది. ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్..జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎంపిక చేసే స్థా
యిలో ఉన్నారా?లేదంటే అధినాయకత్వం ఈ అంశంపై మదింపు చేస్తుందా? అన్న దానిపై క్లారిటీ ఇవ్వట్లేదు. ఎవరికి వారు తమకే టికెట్ కన్ఫర్మ్ అన్నట్లుగా ప్రచారం చేసుకోవటం చూస్తే.. పక్కా ప్లానింగ్ మిస్ అయ్యిందన్న భావన వ్యక్తమవుతోంది. ఈ ఉప ఎన్నికపై క్లారిటీతో కేసీఆర్ అంటే.. అవసరానికి మించిన కన్ప్యూజన్ తో కాంగ్రెస్ ఉందన్న మాట వినిపిస్తోంది. ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ టికెట్ ఎవరికి? అన్నదిప్పుడు చర్చగా మారింది. రేవంత్..కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకునే నిర్ణయం..తెలంగాణ భవిష్యత్తు రాజకీయాల్నిఅంతో ఇంతో ప్రభావితం చేస్తుందని మాత్రం చెప్పక తప్పదు.