శాసనమండలి చైర్మన్ మోషేస్ రాజును ప్రభుత్వం అవమానిస్తుందని వైసిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని కొత్త భవనం ప్రారంభోత్సవానికి మోషెస్ రాజును పిలవలేదని, అక్కడ శిలాఫలకంపై శాసనమండలి చైర్మన్ పేరు ముద్రించలేదని బొత్స ఆరోపించారు. దాంతోపాటు తిరుపతిలో జరిగిన మహిళా సదస్సుకు ఆయనకు ఆహ్వానం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడు అన్న కారణంతోనే ఆయనపై ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని బొత్స సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిణామాలపై సీఎం చంద్రబాబు శాసనమండలికి వచ్చి సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే బొత్స ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఆ ఆహ్వాన పత్రికలో మండలి చైర్మన్ మోషెస్ రాజు పేరు లేకపోవడానికి గల కారణాలు తెలుసుకుంటామని ఆయన చెప్పారు. ఈ విషయంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇక, మండలి చైర్మన్ ను అవమానించారని బొత్స చెప్పడం సరికాదన్నారు. ఈ క్రమంలోనే సభలో గందరగోళ పరిస్థితిలో ఏర్పడ్డాయి. దీంతో, శాసనమండలి వాయిదా వేయాల్సి వచ్చింది.