టాలీవుడ్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్యామిలీస్‌లో అల్లు కుటుంబం ఒకటి. సినిమాల్లోనే కాదు, వ్యాపార రంగంలోనూ ఈ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఓ హ్యాపీ మూమెంట్‌లోకి అడుగుపెట్టబోతుంది. అల్లు వారింట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అల్లు అరవింద్ చిన్న కుమారుడు, నటుడు అల్లు శిరీష్ సింగిల్ లైఫ్‌కు బై బై చెప్పి మింగిల్ కాబోతున్నాడు.
ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ కుమార్తెతో ఆయన వివాహం జరగనుందని, ఇరు కుటుంబాలు ఇప్పటికే మాట్లాడుకున్నాయని సమాచారం. అయితే ఇంతలోనే అల్లు అరవింద్ తల్లి, శిరీష్ నానమ్మ అల్లు కనకరత్నం మృతి చెందడంతో పెళ్లి ఏర్పాట్లు నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ పెళ్లి పనులు మొదలయ్యాయని, త్వరలోనే ఎంగేజ్‌మెంట్ ముహూర్తం ఖరారవుతుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.
కాగా, 2013లో వచ్చిన ‘గౌరవం’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన శిరీష్.. ఆ తరువాత `కొత్త జంట`, `శ్రీరస్తు శుభమస్తు`, `ఒక్క క్షణం`, `ఏబీసీడీ`, `ఊర్వశివో రాక్షసివో` వంటి సినిమాలు చేశాడు. ఈ చిత్రాలు ఆయనకు గుర్తింపు ఇచ్చినా, స్టార్డమ్ మాత్రం తీసుకురాలేకపోయాయి. ఓపక్క అతని అన్న అల్లు అర్జున్ తన కెరీర్‌ని చాలా క్లియర్ ప్లానింగ్‌తో ముందుకు తీసుకెళ్తూ పాన్ ఇండియా స్టార్‌గా వెలుగుతున్నాడు. కానీ శిరీష్ మాత్రం ఇంకా టాలీవుడ్ టైర్ 2 హీరోల జాబితాలోనే ఉండిపోయాడు. ఇండస్ట్రీలో బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా అది ఆయనకు పెద్దగా హెల్ప్ కాలేదు. శిరీష్ చివరిగా `బడ్డీ` మూవీతో పలకరించాడు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల కోసం స్క్రిప్ట్స్ వింటున్నాడని సమాచారం.