అమెరికాలోని బే ఏరియాలో కూడా ఇప్పుడు బెజవాడ స్టైల్ స్ట్రీట్ ఫుడ్ దొరుకుతోంది. ముఖ్యంగా రాత్రివేళ ఆలస్యమైనా తినాలనుకునే వారికి ఇది పర్ ఫెక్ట్ డెస్టినేషన్.
బెజవాడ పటమట ఏరియాలో స్ట్రీట్ ఫుడ్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు 'ఫ్లయింగ్ ఇడ్లీస్'. ప్రత్యేకించి శ్రీకాంత్ దొడ్డపనేని మార్గదర్శకత్వంలో ఈ ఐటమ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. స్టైల్‌గా ఎగరేసి ప్లేట్‌లో ఇడ్లీలు వడ్డించి కస్టమర్లకు అందించడంతో ఈ 'ఫ్లయింగ్ ఇడ్లీస్' కి పేరు వచ్చింది. బే ఏరియాలోని చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో సైతం వాటిని ఆస్వాదించేందుకు క్యూ లైన్లలో ఎన్నారైలు వేచి ఉంటున్నారు. అర్ధరాత్రి సమయంలో వెచ్చగా… రుచిగా… స్టైల్‌గా…స్ట్రీట్ ఫుడ్ తినేందుకు చాలామంది ఎన్నారైలు ఆసక్తి చూపుతున్నారు.
ఫ్రీమాంట్, మిల్పిటాస్, సాన్‌జోస్ దగ్గర ఉన్న ఇండియన్ ఫుడ్ స్ట్రీట్ ప్లేస్‌లలో, అర్ధరాత్రి వరకు ఈ స్ట్రీట్ ఫుడ్ అందుబాటులో ఉంటోంది.
బెజవాడ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్:మిర్చి బజ్జీలు, పనీర్ పకోడి, కర్రీ దోశ, ఎగ్ దోశ, గోబీ మంజూరియన్, చికెన్ 65, ఆంధ్రా స్పెషల్ బిర్యానీ, వేడి వేడి జిలేబీ, బెజవాడ స్టైల్ మీఠా, సాదా, ఫైర్ పాన్ తదితర ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి.