ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వైసీపీ సభ్యులు హాజరుకాని సంగతి తెలిసిందే అయితే వైసీపీ సభ్యులు లేని లోటును బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తదితరులు తీర్చారని విమర్శలు వస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్లు జనసేన, టీడీపీల మధ్య గ్యాప్ వచ్చేందుకు దోహదపడేలా ఉన్నాయి.
మరోవైపు కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ ల మధ్య జరిగిన సంభాషణ కూడా కూటమిని ఇరుకున పెట్టేలా పెట్టేలా ఉంది. ఈ నేపథ్యంలోనే టిడిపి ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలీదా అంటూ వారిపై చంద్రబాబు ఫైర్ అయ్యారట. ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, కూన రవికుమార్, బోండా ఉమల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సభలో టిడిపి సభ్యులను కంట్రోల్ చేయాలి కదా అని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు కూడా చంద్రబాబు క్లాస్ పీకారట. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే పర్వాలేదని, వ్యక్తిగత ఎజెండాలు ఏంటని చంద్రబాబు గట్టిగానే వారిని మందలించారట
అధికార పార్టీ సభ్యులనుకుంటున్నారా లేదా ప్రతిపక్ష పార్టీ సభ్యులు అనుకుంటున్నారా అని గట్టిగా ముందలించారట. టిడిపి శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, సభ్యులందరికీ అక్కడే గట్టిగా వార్నింగ్ ఇస్తానని చంద్రబాబు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షం సభలో లేకపోతే ప్రతిపక్షం కంటే దారుణంగా మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారట.