ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడింది అన్నది పాత సామెత. టిడిపి నేతలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వైసిపి డిజిటల్ బుక్ యాప్ లాంచ్ చేసింది. అయితే, ఈ యాప్ ప్రవేశపెట్టిన మొదటి రోజున వైసిపి నేత విడదల రజనిపై ఫిర్యాదు అందడం కొత్త సామెత. జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డిజిటల్ బుక్ యాప్ ఆ పార్టీ నేతలను ఇరకాటంలో పడేసింది. వైసిపి నేతలు, కార్యకర్తలకు అన్యాయం జరిగితే కంప్లైంట్ చేసేందుకు తీసుకువచ్చిన ఈ యాప్ లో తొలి ఫిర్యాదు మాజీ మంత్రి విడుదల రజనపై అందడంతో వైసీపీ నేతలు షాకయ్యారు.
2022లో తనపై విడుదల రజని దాడి చేయించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వైసిపి డిజిటల్ బుక్ యాప్ లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ జగన్ కు డిజిటల్ ద్వారా ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదు పై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. అలా జరిగితే కార్యకర్తలకు కూడా ఈ యాప్ పై నమ్మకం కలుగుతుందని సుబ్రహ్మణ్యం అన్నారు. లోకేష్ రెడ్ బుక్ కు పోటీగా జగన్ తెచ్చిన డిజిటల్ బుక్ తొలి రోజే అట్టర్ప్ ఫ్లాప్ కావడంతో వైసిపి నేతలు తలలు పట్టుకుంటున్నారు.