భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పగబట్టినట్టుగా కనిపిస్తోంది. హెచ్1 బి వీసాలపై వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ తాజాగా భారతీయులతో పాటు విదేశీ సినీ నిర్మాతలకు భారీ షాక్ ఇచ్చారు. అమెరికా వెలుపల నిర్మాణం జరుపుకొని అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్ విధిస్తూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు పన్ను మినహాయింపు ఉంటుందని ప్రకటించారు.
తాజాగా ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం ఎక్కువగా భారతీయ సినిమాలపై ప్రత్యేకించి తెలుగు సినిమాలపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. అమెరికాలో ఇకపై విడుదల చేయబోయే తెలుగు సినిమాలకు 100% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అమెరికా సినిమా నిర్మాణ రంగాన్ని ఇతర దేశాలు దొంగిలించాయని, చిన్న పిల్లల దగ్గర నుంచి క్యాండీ లాక్కున్నట్లు లాక్కున్నాయని ట్రంప్ అన్నారు. కాలిఫోర్నియాకు ఉన్న అసమర్థ, బలహీన గవర్నర్ వల్లే ఇలా జరిగిందని విమర్శించారు.