సినిమాటిక్ యూనివర్శ్.. మల్టీవర్స్.. ఈ మాటలు హాలీవుడ్లో ఎప్పట్నుంచో పాపులర్. వేర్వేరు సినిమాలకు, పాత్రలకు కనెక్షన్ పెట్టి యూనివర్శ్‌లు, మల్టీవర్స్‌లు క్రియేట్ చేయడం అక్కడ చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఇండియన్ ఫిలిం మేకర్స్ కూడా ఈ ఒరవడిని అందిపుచ్చుకుంటున్నారు. మానగరం, ఖైదీ, విక్రమ్ చిత్రాలకు కనెక్షన్ పెట్టి లోకేష్ కనకరాజ్ క్రియేట్ చేసి ఎల్సీయూ ఎంత హైప్ తెచ్చుకుందో తెలిసిందే.
కానీ లియో, కూలీ చిత్రాలు ఫెయిలవడంతో ఆ యూనివర్శ్ హైప్ అంతా తగ్గిపోయింది. ఇదే సమయంలో తెలుగులో ఒక కొత్త మల్టీవర్స్ శ్రీకారం చుట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీకి.. ప్రభాస్ మూవీ సాహోకు చిన్న కనెక్షన్ పెట్టిన దర్శకుడు సుజీత్.. పవన్, ప్రభాస్ ఫ్యాన్స్‌ను అలరించాడు. పవన్ పాత్ర వాజి నగరం గురించి ప్రస్తావించినపుడు.. జాకీష్రాఫ్ పాత్రను చూపించినపుడు థియేటర్లు హోరెత్తిపోయాయి.
భవిష్యత్తులో అవకాశాన్ని బట్టి మల్టీవర్స్‌ను కొనసాగిస్తానని.. పవన్, ప్రభాస్‌ల వీలును బట్టి సినిమా చేస్తానని సుజీత్ ఇటీవల పేర్కొన్నాడు.
అదెంత వరకు సాధ్యమో కానీ.. ఇప్పుడు పవన్ స్వయంగా ఓజీ యూనివర్శ్ గురించి మాట్లాడ్డం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. తన అన్నయ్య చిరంజీవితో కలిసి ఓజీ సినిమాను వీక్షించిన పవన్.. సుజీత్ దర్శకత్వ ప్రతిభను కొనియాడాడు. ఓజీ సినిమాకు సంబంధించి యూనివర్శ్ క్రియేట్ చేయడం అద్భుతమైన విషయం అని.. అది పూర్తిగా సుజీత్ క్రియేషన్ అని.. దాని కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానని పవన్ చెప్పాడు.
ఓజీ సినిమా అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చిన సినిమా అని.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఇది ఆకట్టుకునేలా రూపొందిందని పవన్ చెప్పాడు. తమన్ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించాడని.. రవి.కె.చంద్రన్ విజువల్స్ అద్భుతమని పవన్ కొనియాడాడు. రిలీజ్‌కు ముందు, తర్వాత ఓజీ సినిమాను పెద్దగా ప్రమోట్ చేయని పవన్.. జ్వరం నుంచి కాస్త కోలుకున్నాక అన్నయ్యతో కలిసి సినిమా చూసి.. ఓజీ యూనివర్శ్ గురించి మాట్లాడ్డం అభిమానులకు అమితానందాన్నిస్తోంది.