88.7 లక్షల కోట్ల రూపాయిలు. చదవటానికి సింఫుల్ గా అనిపించొచ్చు కొందరికి. కానీ.. ఈ అంకెను పేపర్ మీద రాసేందుకు ప్రయత్నిస్తే కష్టమేంటో అర్థమవుతుంది. (8,87,00,00,00,00,000) ఈ భానీ మొత్తాన్ని సింఫుల్ గా డాలర్లలో చెప్పాల్సిన వస్తే ట్రిలియన్ డాలర్లు. మన రూపాయిల్లో అయితే రూ.88.76 లక్షల కోట్లు) ఇంత భారీ సంపదకు యజమాని అయ్యేందుకు వీలుగా ఎలాన్ మస్క్ అడుగులు పడుతున్నాయి.
తన విపరీత చేష్టలతో తరచూ ప్రపంచాన్ని ఆకర్షించే ఈ వ్యక్తి తాజాగా సాధించిన రికార్డు ఏమిటో తెలుసా? ఈ భూమిమీద ట్రిలియన్ డాలర్ల సంపదకు యజమానిగా అవతరించే దిశగా మస్క్ దూసుకెళుతున్నారు. తాజాగా ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ ట్రాకర్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ భూమి మీద తొలి ట్రిలియనీర్ గా చరిత్రను క్రియేట్ చేసే దిశగా మస్క్ పయనిస్తున్నారు.తాజాగా ఆయన సంపద 500 బిలియన్ డాలర్లను దాటేసినట్లు పేర్కొన్నారు.
కొద్ది రోజులుగా మస్క్ కు చెందిన టెస్లా షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. చైనాకు చెందిన బీవైడీ ఎలక్ట్రికల్ కార్ల దెబ్బకు టెస్లా షేర్లు తీవ్రంగా ప్రభావితమవుతోంది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో విభేదాలకు సైతం వెనుకాడని మస్క్ తీరుతో ఆయన సంస్థ షేర్లు పతనమయ్యాయి. ఇలాంటి వేళ.. మస్క్ తీసుకున్న నిర్ణయంతో టెస్లా షేర్లు మళ్లీ మార్కెట్ లో పుంజుకోవటం షురూ అయ్యింది.
కొద్ది రోజుల క్రితం మస్క్ ఒక బిలియన్ విలువైన టెస్లా షేర్లను కొనుగోలు చేయటమేకాదు.. తమ సంస్థ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించటంతో మదుపరులలో కొత్త విశ్వాసాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. ఆ షేరు ఇప్పుడు అంతకంతకూ ముందుకు వెలుతోంది. టెస్లా.. స్పేస్ ఎక్స్.. ఎక్స్.. స్టార్ లింక.. న్యూరాలింక్ లాంటి సంస్థలని నడిపిస్తునన మస్క్.. ఆయన సంపదలో కీలకమైన ఎలక్ట్రిక్ కార్ల సంస్త టెస్లాను మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.
సెప్టెంబరు 15 నాటికి ఆయనకు టెస్లాలో 12.4 శాదం వాటా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెస్లా షేర్లు పద్నాలుగు శాతం పెరగ్గా.. బుధవారం ఒక్కరోజే నాలుగు శాతం దూసుకెళ్లాయి. దీంతో.. మస్క్ సంపద మరింత పెరిగింది. రానున్న రోజుల్లో టెస్లా విలువను భారీగా పెంచేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రోబో ట్యాక్సీలు.. ఏఐ మార్ెట్ విస్తరణ లాంటి లక్ష్యాలతో పాటు.. భారీ విస్తరణకు తెర తీస్తున్నారు.
ఆయన తన లక్ష్యాల్ని భారీగా సాధిస్తే ప్రతిపాదిత ప్రోత్సాహక ప్యాకేజీ కింద ఆయనకు భారీగా షేర్లు సమకూరనున్నాయి. దీని విలువ ఏకంగా 900 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉంటుందనిచెబుతున్నారు.దీంతో.. మస్క్ సంపద ఏకంగా ట్రిలియన్ డాలర్లు సాధించిన వ్యక్తిగా నిలిచే వీలుంది. అయితే.. ఇది అనుకున్నంత తేలిక కాదని.. బీవైడీ నుంచి వస్తున్న పోటీకి బ్రేకులు వేయగలిగితే మాత్రం.. మస్క్ కు తిరుగే ఉండదని చెబుతున్నారు.