ఆ స్టార్ కపుల్ ఎంగేజ్మెంట్ అయిపోయిందా?

admin
Published by Admin — October 04, 2025 in Movies
News Image

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రేమ వ్యవహారం చాలాకాలంగా హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక, విజయ్ దేవరకొండ ల మధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ చాలాకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఈ జంట మకాం వేసిందని, అక్కడ రెస్టారెంట్లు చుట్టేస్తుందని అప్పుడప్పుడు ఫోటోలు లీక్ అవుతుంటాయి. కానీ, ఈ ఇద్దరిలో ఎవరు తమ రిలేషన్ షిప్ గురించి అధికారకంగా ప్రకటన చేయలేదు. ఈ నేపద్యంలోనే హఠాత్తుగా విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం జరిగిపోయింది అన్న వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారింది.

దసరా నాడు అత్యంత గోప్యంగా ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య, కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. వీరిద్దరూ ఎంగేజ్మెంట్ రింగ్స్ పెట్టుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఇద్దరి వివాహాన్ని ఘనంగా జరిపించేందుకు ఇరువురి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ నిశ్చితార్థం గురించి త్వరలోనే విజయ్, క్రష్మికలు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట.

Tags
heroine rashmika mandanna hero vijay devarakonda engagmenet? lovers
Recent Comments
Leave a Comment

Related News