టాలీవుడ్ హీరో కారుకు యాక్సిడెంట్

admin
Published by Admin — October 06, 2025 in Movies
News Image

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఇద్దరు పెళ్లిపీటలెక్కబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ, ఇంతవరకు ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా ఈ విషయం గురించి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, అనూహ్యంగా ఈ రోజు విజయ్ దేవరకొండ కారుకు యాక్సిడెంట్ అయింది. ఈ కారులో విజయ్ దేవరకొండ మేనేజర్, మిత్రులు ఉన్నట్లు తెలుస్తోంది.

జోగులాంబ గద్వాల సమీపంలో బొలెరో వాహనాన్ని విజయ్ దేవరకొండ కారు ఢీకొట్టింది. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ముందు భాగం బాగా దెబ్బతింది. ఈ ఘటనలో విజయ్, మిగతా వారికి ఎటువంటి గాయాలు కాలేదు. పుట్టపర్తి నుండి హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఎంగేజ్మెంట్ అయిన రెండు రోజులకే ఇలా యాక్సిడెంట్ జరగడంతో విజయ్ దేవరకొండ కుటుంబం షాకయినట్లు తెలుస్తోంది.

Tags
hero vijay devarakonda met with accident safe car damaged
Recent Comments
Leave a Comment

Related News