విజన్ 2020 అంటూ 20 ఏళ్ల క్రితమే ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని అంచనా వేసిన దార్శనీకుడు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీకి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన చంద్రబాబు గుర్తించారు. ఈ క్రమంలోనే అమరావతిలో డ్రోన్ షో నిర్వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఇక, తాజాగా ఏపీలో టెక్నాలజీ వినియోగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రభుత్వం కీలక అడుగు వేశారు. ఏపీలోని కర్నూలులో 'డ్రోన్ సిటీ' ఏర్పాటుకు సన్నాహాలు మొదలుబెట్టారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకు స్థాపన జరగనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌లో డ్రోన్ సిటీని నిర్మిచనున్నారు. భారతదేశంలో మొట్టమొదటి మరియు అతిపెద్ద డ్రోన్ నగరంగా ఇది అవతరించనుంది. డ్రోన్ల తయారీలో దేశానికి అగ్రగామిగా కర్నూలు నగరం నిలవనుంది. ఈ నెల 16న శ్రీశైలంలో మోదీ పర్యటన ఖరారైంది. ఈ క్రమంలోనే డ్రోన్ సిటీకి మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని చంద్రబాబు భావించారు. ఈ డ్రోన్ సిటీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా, పెట్టుబడులను ఆకర్షించేలా ఈ ఏడాది డిసెంబరులో భారీ స్థాయిలో మరో 'డ్రోన్ షో' నిర్వహించాలని ఆయన ఫిక్స్ అయ్యారు.
ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఆర్టీజీఎస్, పౌర సేవలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. , వ్యవసాయం, వైద్య రంగాల్లో డ్రోన్ల వాడకాన్ని మరింత పెంచాల్సిన అవసరముందని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ అవసరాలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా డ్రోన్ టెక్నాలజీని ప్రోత్సహించాలని ఆదేశించారు. ఇప్పటికే డ్రోన్ల సాయంతో మందుబాబులు, డ్రగ్స్ సేవించేవారి ఆటకట్టిస్తున్న సంగతి తెలిసిందే.