2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీ రాజకీయాలపైనే టీడీపీ ఎక్కువగా ఫోకస్ చేసింది, అయితే తాజాగా తెలంగాణ టిడిపి ప కూడా గట్టిగా ఫోకస్ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు తెలంగాణలో పార్టీకి పునర్ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు ఈ రోజు కీలక భేటీ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడి నియామకం, రాష్ట్ర, మండల స్థాయి కమిటీల ఏర్పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు.
పార్టీని సమర్థవంతంగా నడిపించగల నాయకుడికి టీడీపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో ఇప్పటికే దాదాపు రెండు లక్షల సభ్యత్వ నమోదు పూర్తయిందని చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు వెల్లడించారు. తాత్కాలికంగా కీలక నేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. అయితే, రెండు, మూడు రోజుల్లో 638 మండల కమిటీలు, డివిజన్ కమిటీల నియామకం పూర్తి చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ సమావేశంలో అరవింద్ కుమార్ గౌడ్, కంభంపాటి రామ్మోహన్, నన్నూరి నర్సిరెడ్డి, నందమూరి సుహాసిని తదితరులు పాల్గొన్నారు.