ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ అమరావతి నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటూ చంద్రబాబు వడివడిగా నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన వైపు అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలోనే తాజాగా అమరావతిలో సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయం నూతన భవనాన్ని చంద్రబాబు ప్రారంభించబోతున్నారు.
అక్టోబర్ 13వ తేదీ ఉదయం 9:54 నిమిషాలకు సీఆర్డీఏ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ఓపెన్ చేయబోతున్నారు. జీ+7 అంతస్తులుగా దాదాపు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాయపూడి దగ్గర సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని నిర్మించారు. ఈ సువిశాల భవన నిర్మాణం కోసం దాదాపుగా 257 కోట్లు ఖర్చు చేశారు. త్వరలోనే ఈ భవనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. మరో మూడేళ్లలో అమరావతి రాజధానిని పూర్తి చేస్తామని, ప్రధాని మోదీ చేతులు మీదుగా ప్రారంభిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే.