మంచు మోహన్‌బాబు..ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తిరుపతిలో ఆయనకు మోహన్‌బాబు యూనివర్సిటీ ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగానేకాకుండా.. విద్యా సంస్థల పరంగా కూడా చర్చకు వచ్చింది. దీనిని మూసి వేయాలని ఏపీ ఉన్నత విద్యాశాఖ నియమించిన త్రిసభ్య అధికారుల బృందం సిఫారసు చేసింది. అంతేకాదు.. రూ.15 లక్షలు జరిమానా విధించగా.. దానిని యూనివర్సటీ చెల్లించింది.
1991-92లో శ్రీవిద్య నికేతన్ పేరుతో డైలాగ్ కింగ్ మోహన్ బాబు తిరుపతి శివారులో విద్యా సంస్థలు స్థాపిం చారు. ఇవి .. 40 ఎకరాల్లో విస్తరించాయి. తర్వాత.. పుంజుకున్న నేపథ్యంలో వీటిని యూనివర్సిటీలుగా మార్చుకున్నారు. అయితే.. ఎప్పటికప్పుడు.. ఈ సంస్థల చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2014-19 మధ్య తమకు రీయింబర్స్‌మెంటు నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. తిరుపతిలో సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా మోహన్ బాబు రోడ్డెక్కినిరసన చేశారు.
తర్వాత వైసీపీతో చేతులు కలిపినా.. ఆ పార్టీ హయాంలోనూ తమకు న్యాయం జరగలేదని.. గత 2024 ఎన్ని కలకు ముందు.. తీవ్ర ఆరోపణలు చేసి.. ఓడించాలని పిలుపునిచ్చారు. ఇలా.. రాజకీయ కేంద్రంగా మారు తున్న దరిమిలా.. మోహన్ బాబు యూనివర్సిటీపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రధానంగా విద్యార్థులను పీడిస్తున్నారన్నది పెద్ద ఆరోపణ. ఏకంగా 27.5 కోట్ల రూపాయలను విద్యార్థుల నుంచి `అదనంగా` వసూలు చేశారని పిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
విచారణ చేసిన కమిటీ.. నిజమేనని నిర్ధారించింది. ఈ క్రమంలోనే రూ.15 లక్షలు జరిమానా విధించగా.. యూనివర్సిటీ దానిని కట్టింది. తప్పు చేయనప్పుడు.. ఈ జరిమానా ఎందుకు కట్టారన్నది ప్రశ్న. సో.. యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అదనంగా గుంజేసింది. అయితే.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంచు విష్ణు(యూనివర్సిటీ సీఈవో)... ఉన్నత విద్యాశాఖ కమిషన్ తమ యూనివర్సిటీపై జరిపిన విచారణకు సంబంధించిన నివేదికను వెబ్ సైట్ లో పెట్టడాన్ని తప్పుబట్టారు. చిందులేశారు.
కానీ.. తమను నమ్మి చేరిన విద్యార్థుల నుంచి అదనపు వసూళ్లు చేసినప్పుడు.. ఈ బాధ లేదా? అనేది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్న మాట. కాగా.. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పరిధిలోకి చేరింది. ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు.. టీడీపీతో ఉన్న విభేదాల నేపథ్యంలో కూడా.. మోహన్‌బాబు ఏమీ చెప్పలేకసతమతమవుతున్నార