ఏపీలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ, విక్రయాల వ్యవహారం సర్కారును తీవ్రస్థాయిలో కుదిపే స్తోంది. పైకి మౌనంగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం అంతర్గత చర్చల్లో ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుం ది. అయితే.. ఈ నకిలీ మద్యంలో పాత్ర ధారుల వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు తనకు ఏ పాపం తెలియదని చెప్పిన.. టీడీపీ నుంచి సస్పెన్షన్కు గురైన జయచంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారన్నది ఎక్సైజ్ అధికారులు చెబుతున్న మాట.
2024 ఎన్నికల తర్వాత.. నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నాయకుల హస్తం ఉందని స్పష్టం చేస్తున్నా రు. వాస్తవానికి 2021 తర్వాత.. నకిలీ మద్యం తయారీ, విక్రయాలు ఉన్నప్పటికీ.. రాజకీయ ప్రమేయం లేదని చెబుతున్న అధికారులు.. 2024 ఎన్నికల తర్వాత మాత్రం టీడీపీ నేతల ప్రమేయం ఎక్కువగా ఉందని తేల్చి చెప్పారు. తాజాగా వెలుగు చూసిన జనార్దన్ రావు రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల తర్వాత.. బాలాజీ అనే వ్యక్తి ద్వారా నకిలీ మద్యం తయారీ మరింత ఎక్కువగా చేశారు.
అయితే.. దీనిని సరఫరా చేయడం.. విక్రయించడం వంటి విషయాల్లో ఇబ్బందులు రావడంతో ఏ-1గా ఉ న్న జనార్దన్‌రావు.. టీడీపీ నేత, ఆయన మిత్రుడు జయచంద్రారెడ్డిని కలిసి.. తమతో వ్యాపారం చేయాలని కోరగా.. ఆయన తన సోదరుడితో కలిసి మద్యం వ్యాపారంలోకి దిగారు. అప్పటికే ప్రభుత్వ వైన్స్ దుకాణా లు నిర్వహిస్తున్న జయ చంద్రారెడ్డి వాటి ద్వారానే ఈ నకిలీ మద్యం విక్రయాలు నిర్వహించినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా సరుకును రవాణా చేయడంలోను.. తనకు తెలిసిన వారి షాపుల్లో విక్రయించడం కూడా జయచంద్రారెడ్డి కనుసన్నల్లోనే సాగినట్టు రిపోర్టులో పేర్కొన్నారు.
ఇక, జయచంద్రారెడ్డిని పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. దీంతో ఆయన ఇతర దేశాలకు పారిపోయినట్టు తెలుస్తోంది. ఆయనతోపాటు.. ఆయన సోదరుడిని కూడా అరెస్టు చేసేందుకు.. పోలీసులు ప్రయత్నిస్తు న్నారు. మరోవైపు జనార్దన్‌రెడ్డికి విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. ఈ పరిణామాలతో సహజంగానే టీడీపీ నేతల్లో ఒకింత ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు వైసీపీ నేతలు చేశారని ఆరోపిస్తుండగా.. ఇప్పుడు తమకే చుట్టుకోవడం పట్ల వారు ఆందోళనతోనూ ఉన్నారు.