ఏపీ సీఎం చంద్రబాబు స్మార్ట్ గా ఆలోచన చేస్తారు. ఒకప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుడు కూడా ఆయన వర్క్‌హాలిక్‌గానే ఉన్నారు. అయితే.. గతానికి ఇప్పటికీ.. పనితీరులో `స్మార్ట్` వచ్చింది. తానే కాదు.. చిన్న స్థాయి వ్యాపారులు సైతం స్మార్ట్‌గా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే `స్మార్ట్ స్ట్రీట్స్` పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపారుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నా రు. దీనిలో భాగంగా తొలి ప్రయత్నంగా నెల్లూరులో `స్మార్ట్ స్ట్రీట్స్`ను ఏర్పాటు చేశారు.
ఏంటీ స్మార్ట్ స్ట్రీట్స్!
ఇప్పటి వరకు రహదారుల పక్కన, ఫుట్ పాత్‌లపై చిరు వ్యాపారాలు చేసుకునేవారు ఉన్న విషయం తెలి సిందే. ముఖ్యంగా నగరాల్లో ఈ సంస్కృతి కొన్ని దశాబ్దాలుగా ఉంది. అయితే.. వీరివల్ల ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. ఒక్కొక్క సారి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి వారిని ఒక దగ్గరకు చేర్చి.. ప్రభుత్వమే స్వయంగా వారికి దుకాణాలు ఏర్పాటు చేస్తుంది. ఈ దుకాణాల్లో అధునాతన సౌకర్యాలు కూడా కల్పిస్తారు.
అంటే.. వైఫై, డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ కాటాలు, నాణ్యమైన సరుకులు విక్రయించేలా ఏర్పాటు చేస్తారు. అంతేకాదు.. ఈ దుకాణాలను కేవలం మహిళలకు మాత్రమే కేటాయిస్తారు. మెప్మా, డ్వాక్రా వంటి సంఘాల్లో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి రుణాలు ఇప్పించి.. వారితో ఈ వ్యాపారాలను ప్రోత్సహిస్తా రు. దీనివల్ల సదరు నగరం రూపురేఖలు కూడా మారుతాయని సర్కారు అంచనా వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నెల్లూరులో 7 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసి.. 130 దుకాణాలను ఏర్పాటు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా..
ఇక, నెల్లూరులో ఏర్పాటు చేసినట్టే.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ స్మార్ట్ స్ట్రీట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, ఒంగోలు, కాకినాడ, రాజమండ్రి వంటి అన్ని నగరాల్లోనూ ఇదే తరహా స్ట్రీట్స్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో మాత్రం ఈ తరహా స్మార్ట్ స్ట్రీట్స్ ఉండడం గమనార్హం.nell