అమెరికా వెలుపల భారీ పెట్టుబడిని ఏపీలో గూగుల్ పెట్టడం ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ఎక్కువగా సెర్చ్ అవుతోంది. విశాఖ నుంచి భవిష్యత్తులో గూగుల్ సెర్చ్, యూట్యూబ్, జీమెయిల్ సేవలు ప్రపంచవ్యాప్తంగా అందించే అవకాశముందని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్ స్వయంగా ప్రకటించారంటే ఈ ప్రాజెక్టు గురించి గూగుల్ ఎంత క్లారిటీతో ఉందో అర్థమవుతోంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు గురించి ఏపీ సీఎం చంద్రబాబు తనదైన శైలిలో కాకుండా వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఓకే గూగుల్...సింక్రనైజింగ్ వికసిత్ భారత్ అంటూ చంద్రబాబు ఎక్స్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.
ఆ క్రమంలోనే తాజాగా ViZAG లో G (Google Icon G) అంటే గూగుల్ అని చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పెట్టిన మరో పోస్ట్ ట్రెండ్ అవుతోంది. # యంగెస్ట్ స్టేట్ హైయెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ అంటూ చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అయింది. చంద్రబాబు టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటారని, అందుకే 20 ఏళ్ల క్రితం ఐటీ రంగాన్ని ప్రమోట్ చేశారని, తాజాగా ఏఐని కూడా అదే మాదిరిగా ప్రోత్సహిస్తున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా, ట్రెండ్ ను ఫాలో అవుతున్న చంద్రబాబు...ఇలా హ్యాష్ ట్యాగ్ లు, క్యాచీ పోస్టులతో వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును జెన్ జడ్ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారని అంటున్నారు.