ప్రధాని మోదీకి ఓర్వకల్లు విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో లోకేశ్ ను ఉద్దేశించి మోదీ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. గతసారి చూసినప్పటికంటే ఇప్పుడు చాలా బరువు తగ్గావు...అంటూ లోకేశ్ తో మోదీ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్వరలోనే మీ నాన్నలా తయారవుతావంటూ చంద్రబాబు ఫిట్ నెస్ గురించి మోదీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్ ల ఫిట్ నెస్ కు మోదీ ఫిదా అయిన వైనం హాట్ టాపిక్ గా మారింది.