సాదాసీదా మనుషుల మాదిరిగా ఓ అరుగు మీద ఇరుగుపొరుగు మాదిరి ఈ ముగ్గురు నేతలు కూర్చున్న ఫొటో..పిక్ ఆఫ్ ది డేగా నిలిచింది. దాంతోపాటు, శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారం దగ్గర కూడా ఈ ముగ్గురు సంప్రదాయ వస్త్రాల్లో నుదుట బొట్టుతో దిగిన ఫొటో కూడా వైరల్ అయింది. కేంద్రంలో ప్రధాని మోదీ...రాష్ట్రంలో చంద్రబాబు, పవన్...ఇలా ఆధ్యాత్మిక భావాలు, దైవ భక్తి కలిగిన ఈ ముగ్గురు నేతలు త్రిమూర్తులు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఈ పర్యటనతో శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న నాలుగో భారత ప్రధాని మోదీ నిలిచారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ఈ ఆలయాన్ని సందర్శించారు. ప్రధాని హోదాలో మోదీ శ్రీశైలానికి రావడం ఇదే తొలిసారి. శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా మోదీ సందర్శించారు. 1677లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ క్షేత్రాన్ని సందర్శించారు. దానికి గుర్తుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి ధ్యాన మందిరాన్ని, శివాజీ విగ్రహాన్ని ప్రధాని పరిశీలించారు.