సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ లండన్ లో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు అందించనున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు, హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. ఆ అవార్డును కూడా భువనేశ్వరి అదే వేదికపై నవంబరు 4న అందుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే భువనేశ్వరితోపాటు సీఎం చంద్రబాబు నేడు లండన్ వెళ్లారు.
ఈ క్రమంలోనే లండన్ లో చంద్రబాబు దంపతులకు ఘన స్వాగతం లభించింది. చంద్రబాబు దంపతులకు లండన్ లోని ఎన్నారై టీడీపీ నేతలు, పలువురు ఎన్నారైలు స్వాగతం పలికారు. చంద్రబాబు, భువనేశ్వరిలకు లండన్ లోని తెలుగు కుటుంబాలు ఆత్మీయ స్వాగతం పలికాయి. వారిని చంద్రబాబు, భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.