ఔను.. భారత క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుత ఘట్టం. ఆదివారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో తలపడిన భారత మహిళా క్రికెటర్లు.. ఎవరూ ఊహించని రీతిలో అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఇది భారత దేశం గర్వించిన క్షణాలనే చెప్పాలి. రాత్రి 11.25 నిమిషాల వరకు హోరీ హోరీగా సాగుతుందని.. భారత్ విజయం కష్టమని భావించిన క్రికెట్ విశ్లేషకులకు .. ఆ తర్వాత క్షణం దక్షిణాప్రికా.. వరుస వికెట్ల నష్టాలతో భారత్ విజయ శిఖరం చేరడం.. నిజమైన అద్ధుతమే కాదు.. ఒక చరిత్ర కూడా!.
ఎందుకంటే.. ఇప్పటి వరకు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో మహిళలు తుది సమరం వరకు వెళ్లినా.. కప్ గెలి చిన సందర్భమే లేదు. అలాంటిది .. అనేక ఆపశోపాలు పడిన ప్రస్తుత జట్టు.. తుదిపోరు వరకు చేరుకోవ డమే కాదు.. ``ఇక, పని అయిపోయింది`` అని సగటు క్రికెట్ అభిమాని అనుకున్న మరుక్షణమే ఉత్తుంగ తరంగా బ్యాట్‌ను వాడేసిన తీరు అందరనీ విస్మయానికి గురిచేసింది. అదే.. భారత్‌కు వన్‌డే మహిళా క్రికెట్‌లో ప్రపంచ పతకాన్ని సాధించి పెట్టింది.
దక్షిణాఫ్రికా జట్టుతో నవీముంబై వేదికగా.. జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ ఆద్యంతం భారత క్రీడామణుల ప్ర తిభ మాత్రమే కాదు.. ఆధిపత్యం కూడా కొనసాగింది. ముఖ్యంగా షఫాలీ వర్మ.. దూకుడు భారత్ విజయా నికి దన్నుగా నిలిచింది. 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి.. ఉమెన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిందనే చెప్పాలి. అంతేకాదు.. టార్గెట్ రీచ్ అయ్యే దశలో ఎక్కడికక్కడ దక్షిణాఫ్రికాను కట్టడి చేయడంలోనూ కీలక రోల్ పోషించింది. దీప్తి శర్మ కూడా తనదైన ఆటతో చెలరేగిపోయింది.
మొత్తంగా.. ఇప్పటి వరకు అసలు కనీస అంచనాలు కూడా లేని మహిళల వన్డే ప్రపంచకప్.. ను సగ ర్వంగా తీసుకువచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టీం.. భారత క్రీడా కీర్తి పతాకను సగర్వంగా రెపరెపలా డించింది. ఆద్యంతం ఆకట్టుకునే భారత్ టీం ఆడిన తీరుకు.. చాలా సందర్భాల్లో క్రికెట్ అభిమానుల నుంచి హర్షాతిరేకాలు వచ్చాయి. కాగా.. భారత్ టీం 298 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా జట్టు 246 పరుగుల వద్దే ఆగిపోయింది. ఏదేమైనా.. దేశం మొత్తం మహిళా క్రికెటర్లకు ఫిదా అయిందనే చెప్పాలి. 52 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 52 పరుగుల తేడాతో