స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఎక్కడ ఉంటే, దర్శకుడు రాజ్ నిడిమోరు అక్కడే ఉంటున్నారు. ఈవెంట్స్, పబ్లిక్ పార్టీస్, వెకేషన్స్.. ఎక్కడ చూసినా ఈ జంట కలసే కనిపిస్తున్నారు. సామ్ ఏ పనిలోనైనా రాజ్ ఇన్‌వాల్వ్ అయి ఉంటాడని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక ఈ జంట కలిసి ఉన్న ప్రతి ఫొటో నెట్టింట వైరల్ కావడం రొటీన్ అయిపోయింది.
ఇటీవల సమంత తన కొత్త పెర్ఫ్యూమ్ బ్రాండ్ “సీక్రెట్ అల్కమిస్ట్” ను లాంచ్ చేసింది. ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. టాలీవుడ్ నుండి స్టార్ హీరోయిన్స్, బిజినెస్ మాగ్నెట్స్ హాజరై ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సామ్.. “కుటుంబం, స్నేహితులతో కలిసి ఉన్నాను.. గత ఏడాదిన్నరలో నా కెరీర్ పరంగా సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌లు తీసుకుంటూ, నా అంతర్‌దృష్టిని విశ్వసిస్తూ ముందుకు సాగుతున్నాను. ఈ రోజు చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నాను. అత్యంత ప్రతిభావంతులైన, నిజాయితీపరులైన వ్యక్తులతో పనిచేయడం నాకు అదృష్టం. ఇది కేవలం ఆరంభం మాత్రమే.” అంటూ క్యాప్షన్ జోడించింది.
అయితే ఈ పిక్స్ లో హైలైట్‌గా నిలిచింది సామ్–రాజ్ జంట ఫొటో. ఒక చేతిలో విస్కీ గ్లాస్ పట్టుకుని, ఇంకో చేత్తో సమంత నడుముపై చేయి వేసి కౌగిలించుకున్నాడు రాజ్. ఈ పిక్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. నెటిజన్లు `ఇది ఫ్రెండ్‌షిప్ కాదు.. రిలేషన్‌షిప్ కన్‌ఫర్మ్!` అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ జంట గురించి వస్తున్న వదంతులు ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి. రాజ్–సామ్ బంధం కేవలం ఫ్రెండ్‌షిప్ కాదని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కవచ్చని సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది.