నమో...భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరుకు షార్ట్ కట్. ఆయన అభిమానులు ముద్దుగా మోదీని నమో అని పిలుస్తుంటారు. ప్రపంచ దేశాలలో కూడా నమో బ్రాండ్ కు మంచి గుర్తింపు ఉంది. అదే విధంగా మోదీ సమకాలీకుడైన ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా గ్లోబల్ ఇమేజ్ ఉంది. జాతీయ మీడియాలో చంద్రబాబును నాయుడు అని సంబోధిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇకపై ఏపీలో నమో అంటే నాయుడు అండ్ మోదీ అని మంత్రి లోకేష్ కొత్త భాష్యం చెప్పారు.
ఈ ఇద్దరు సమర్థ నేతల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు పరుగులు పెడుతోందని లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్త నగరాలు నిర్మించిన చరిత్ర ఉందని చెప్పారు. ఆ అనుభవంతోనే అద్భుతమైన అమరావతి నిర్మాణం చేపట్టారని కితాబిచ్చారు. దేశవిదేశాలలో భారీ పెట్టుబడులను ఆకర్షించి చరిత్ర సృష్టిస్తున్నామని తెలిపారు. యుఎస్ – ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. బ్రెయిన్ డ్రెయిన్ నుంచి బ్రెయిన్ గెయిన్ చేస్తున్నామని,
కేవలం 17నెలల్లో $120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు. విశాఖలో గూగుల్ $15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టబోతోందని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారును చూసి ఏపీలో పెట్టబడులు పెడుతున్నారని చెప్పారు.