దేశంలో సంచలనం సృష్టించిన డిల్లీ ఆత్మహుతి ఘటనలో షాకింగ్ వీడియో బయటపడింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఒక టెర్రరిస్ట్ ఫోన్ లో ఈ వీడియో లభించింది. తనను తను కారు లో కూర్చుని పేల్చుకున్న సూసైడ్ బాంబర్.. డాక్టర్ ముసుగులో ఉన్న ఉగ్రవాది ఉమర్ రికార్డు చేసుకున్న సెల్ఫీ వీడియో ఇది!. తాను చేయబోయే చర్యను సమర్ధించుకుంటూ ఉమర్ మాట్లాడిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఉగ్రవాదులు ఎలా వ్యక్తులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారో కూడా ఈ వీడియో స్పష్టం చేస్తోంది.
కొన్ని కొన్ని కీలక సందర్భాలు, సమయాల్లో ఆత్మాహుతి బాంబర్‌గా మారడం తప్పుకాదని ఉమర్ వ్యాఖ్యా నించడం విశేషం. ``కొందరు ఆత్మాహుతి బాంబర్‌గా మారడాన్ని తప్పని భావిస్తారు. కానీ, ఇది ఎంత మా త్రం కాదు. ఇదొక త్యాగం. ఇది ఒక నిర్ణీత లక్ష్యాన్ని సాధించే క్రమంలో చేసుకునే ఆత్మార్పణం. ఇది అంద రికీ సాధ్యంకాదు. కొందరికే సాధ్యమవుతుంది. ఈ అవకాశం వదులుకోకూడదు`` అని చాలా సునిశితంగా నిదానంగా ఉమర్ వ్యాఖ్యానించాడు.
ఈ వీడియోను అధికారులు విడుదల చేశారు. అయితే.. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యా ప్తంగా ఉగ్రవాదుల వ్యవహారం కలకలం రేపుతున్న క్రమంలో ఇలా కీలకమైన వీడియోను బయటకు విడుదల చేయడంపైనా అనుమానాలు వస్తున్నాయి. అయితే.. వైద్యులను టార్గెట్ చేస్తున్నారంటూ.. వస్తున్న వార్తల నేపథ్యంలోనే ఈ సెల్పీ వీడియోను అధికారులు విడుదల చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఈ దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలావుంటే,.. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఇటీవల జరిగిన కారు పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ పేలుడు నేపథ్యంలో అల్-ఫలా యూనివర్సిటీ పై దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రధాన కార్యాలయంతో పాటు మరో 24 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అల్-ఫలా విశ్వవిద్యాలయానికి అందే నిధులపై దర్యాప్తు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. విశ్వవిద్యాలయానికి చెందిన ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ ట్రస్టీల నివాసాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.