బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి, ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాకు అక్కడి అంతర్జాతీయ నేర వివాదాల ట్రైబ్యునల్ మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే.. వాస్తవానికి దేశ ప్రజలందరిపై నిరంకుశంగా వ్యవహరించారంటూ.. తీర్పు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు.. మానవ హక్కులను హసీనా హననం చేశారని కూడా పేర్కొంది. ఆమె చేసిన తప్పులకు నేరాలకు మరణ శిక్షే సరైన చర్య అని కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తులు సమర్థించుకున్నారు.
ఇదే నిజమైతే.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఇలా ఉండేది కాదేమో. ఎందుకంటే.. హసీనాకు మరణ శిక్ష విధించడాన్ని నిరసిస్తూ.. పెద్ద ఎత్తున బంగ్లాలో ఉద్యమాలుప్రారంభమయ్యాయి.చిత్
ప్రభుత్వ ఆస్తులకు భంగం కలిగించేవారిని.. ధ్వంసం చేసేవారిని కాల్చి వేయాలని ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై మరింతగా నిరుద్యోగులు రెచ్చిపోతున్నారు. మరోవైపు.. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తు లు మృతి చెందారు. పదుల సంఖ్యలో నిరుద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు అవామీ లీగ్ రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించింది. హసీనాకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని లీగ్ నేతలు చెప్పారు. అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టారు. దీనిని ఖండిస్తున్నామన్నారు.
ఇదిలావుంటే.. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలపై ప్రధాని యూనస్ సర్కారు నిశితంగా గమనిస్తోంది. పార్లమెంటు, సుప్రీంకోర్టు సహా పలు కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రజలు గుమి కూడకుండా నిబంధనల కొరడా ఝళిపించింది. మొత్తంగా చూస్తే బంగ్లాదేశ్‌లో పరిస్థితి మరోసారి చేయి దాటే పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది.