సీబీఐ కోర్టులో ఎదురుప‌డ్డ సునీత‌.. జ‌గ‌న్ రియాక్ష‌న్ ఏంటంటే?

admin
Published by Admin — November 20, 2025 in Politics, Andhra
News Image

ఈ రోజు హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు వద్ద ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. ఒకే రోజు, ఒకేసారి, వేర్వేరు కేసుల కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే ఆయన బాబాయ్ కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత హాజరు కావడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. అక్రమాస్తుల కేసులో పరిశీలన జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్ సుమారు ఆరేళ్ల విరామం తర్వాత సీబీఐ కోర్టుకు ప్రత్యక్షంగా వచ్చారు.

సీఎంగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు తీసుకున్న జగన్, ఎన్నికల తర్వాత కూడా అదే సడలింపు కొనసాగించాలని కోరుకున్నా కోర్టు అందుకు అనుమ‌తించ‌లేదు. ఈ నేపథ్యంలో, జగన్ న్యాయమూర్తి రఘురామ్ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. మరోవైపు, తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మళ్లీ వేగవంతం చేయాలని కోరుతూ సునీత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వాదనలు కొనసాగడానికి ఆమె కూడా ఈరోజు కోర్టుకు వచ్చారు.

కోర్టు ప్రాంగణంలో జగన్ మరియు సునీత ఒకే సమయంలో ఎదురుపడ్డారు. జగన్ సునీతను చూసినప్పటికీ, ఒక్క పలకరింపూ లేకుండా, మాట్లాడకుండా నేరుగా ముందుకు సాగిపోవడం అక్క‌డ ఉన్న‌వారంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ ప‌రిణామంతో వారి కుటుంబ విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో స్ప‌ష్ట‌మ‌వుతోంది. వివేకా హత్య కేసు గత కొన్నేళ్లుగా ఏపీ రాజకీయాల్లో అత్యంత స్పర్శనీయమైన అంశంగా ఉంది. ఈ కేసు నేపథ్యంలో సునీత చేసిన ఆరోపణలు, జగన్ వైపు నడుస్తున్న కఠిన రాజకీయ పోరాటం.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే, కోర్టు వద్ద పలకరింపులేని ఈ సన్నివేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు వ‌ద్ద చోటుచేసుకున్న ఈ చిన్న సంఘటన, ప్ర‌స్తుతం పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తోంది.

Tags
YS Jagan YS Sunitha Nampally CBI court YSRCP Ap News YSR family
Recent Comments
Leave a Comment

Related News