శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల ప్రాబల్యంపై పరిశోధన ప్రాజెక్టును నిర్వహించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం తెలిపింది. ఈ పరిశోధన త్వరలో ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టు కోసం 6.2 కోట్ల రూపాయల గ్రాంట్‌ను ఇచ్చేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదించింది. ఇది మూడు సంవత్సరాలలోపు పూర్తి కానుంది. ‘శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ ప్రాజెక్ట్’ అనే ఈ ప్రాజెక్ట్ కింద, ఆరోగ్య శాఖ ఒకటి లేదా రెండు సంవత్సరాలలోపు కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి, వారికి ముందస్తు చికిత్సను అందిస్తుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలను అనుసరించి, ఉద్దానం ఆరోగ్య సంక్షోభం గురించి ఆరోగ్య శాఖ అధికారులు ఐసీఎంఆర్‌తో చర్చించారు. ‘శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ ప్రాజెక్ట్’ అనే ఈ ప్రాజెక్ట్ కింద, ఆరోగ్య శాఖ ఒకటి లేదా రెండు సంవత్సరాలలోపు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి, వారికి ముందస్తు చికిత్స అందిస్తుంది. ఈ ప్రాంతంలో 18 ఏళ్లు పైబడిన వారి నుండి రక్తం, మూత్ర నమూనాలను సేకరిస్తారు. మూత్ర విశ్లేషణలో, ‘బయోమార్కర్స్ పద్ధతి’ని అనుసరిస్తారు. ఇది ఒక వ్యక్తి కిడ్నీ వ్యాధికి గురయ్యే అవకాశం ఏవిధంగా ఉందో సూచిస్తుంది. ఈ వ్యాధికి మూల కారణాలను గుర్తిస్తుంది.
ఫలితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలను అనుసరించి ఆంధ్రా మెడికల్ కాలేజీలోని నెఫ్రాలజీ విభాగాధిపతి జి. ప్రసాద్ ఈ పరిశోధన ప్రాజెక్టు ప్రతిపాదనను సమర్పించారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో గతంలో కూడా అధ్యయనాలు నిర్వహించారు. డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరాన్ని ముందస్తుగా గుర్తించడం, నివారించడంలో సహాయపడే కొత్త మందులు వచ్చాయి. రక్తం, మూత్ర పరీక్షలతో పాటు, కిడ్నీ వ్యాధి జన్యుపరమైనదా కాదా అని నిర్ధారించడానికి ఆర్ ఎన్ ఏ సీక్వెన్సింగ్ కూడా తీసుకుంటారు.
ఉద్దానంలోని ప్రతి 100 మంది జనాభాలో 18% మందికి మూత్రపిండాల పనితీరు బలహీనంగా ఉంది. ఇది ప్రపంచంలో మరెక్కడా కనిపించని అరుదైన వ్యాధి. వాస్తవానికి 2014-18 మధ్య అప్పటి వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పరిశోధన చేపట్టేలా చేసింది. ఆ బాధ్యతను జార్జ్ ఇన్‌స్టిట్యూట్‌కు అప్పగించారు. అయితే, వైసీపీ ప్రభుత్వం , సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగా, పరిశోధన పూర్తి చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు పట్టుబట్టి ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేలా చేశారు. తద్వారా శ్రీకాకుళంలో సుదీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకుఅ భయం ప్రసాదించినట్టు అయింది.