అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా వేలాది ఎకరాల భూములను త్యాగం చేసిన సంగతి తెలిసిందే అయితే జగన్ ఐదేళ్ల పాలనలో అమరావతి నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రైతులకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు.
అమరావతికి భూములిచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి కూడా మద్దతు కావాలని కోరారు.
రైతుల సమస్యలకు త్రిసభ్య కమిటీ న్యాయం చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే 29 గ్రామాల పరిధి సరిపోదని అన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి పర్యటన నేపథ్యంలో క్యాపిటల్ గెయిన్స్ పై మరో రెండేళ్లు పన్ను మినహాయింపు పొడిగించాలని కోరాలని రైతులకు చంద్రబాబు సూచించారు.