తిరుపతిలో 600 ఎకరాల్లో రూ.3 వేల కోట్లతో ఆధ్యాత్మిక టౌన్షిప్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. టౌన్షిప్ నిర్మాణానికి డెల్లా గ్రూప్ ...అనగాని సహకారం కోరింది. టౌన్షిప్ నిర్మాణ స్వరూపాన్ని అనగానికి డెల్లా గ్రూప్ ప్రతినిధులు వివరించారు.
ఆ టౌన్షిప్ లో 5 వేల సంవత్సరాల హిందు ధర్మం సాంస్కృతిక చరిత్రను తెలిపే ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. వసుధైక కుటుంబం పేరుతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్షిప్ నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. నిర్మాణానికి త్వరగా అనుమతులిచ్చేలా సహకరిస్తామని డెల్లా గ్రూపు ప్రతినిధులకు అనగాని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తానని అన్నారు.