గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో వస్తున్న డేటింగ్ వార్తలను నిజం చేస్తూ స్టార్ బ్యూటీ సమంత, దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్నారు. ఈ జంట సోమవారం ఉదయం భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లుగా ఈశా ఫౌండేషన్ వెల్లడించింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోలు ఒక్కటే… సమంత - రాజ్ వివాహంలోని మేజిక్ మోమెంట్స్. అందులోనూ సమంత వేలిని అలంకరిస్తున్న ఆ వెడ్డింగ్ రింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. మెరుపులా మెరిసే ఆ ఉంగరం వెనక ఉన్న చరిత్ర, కట్, విలువలు బయటపడిన తర్వాత అందరూ ఆగి మరోసారి చూస్తున్నారు.
సమంత వెడ్డింగ్ రింగ్‌లో కనిపించే అరుదైన కట్ పేరు ‘పోట్రెయిట్ కట్’. సాధారణంగా మార్కెట్లో కనిపించే కట్‌లతో పోలిస్తే ఇది పూర్తిగా డిఫరెంట్. ఈ డిజైన్‌కి మొఘలుల కాలంలోనే పుట్టిన గొప్ప చరిత్ర ఉందని జ్యువెలర్లు చెబుతున్నారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్‌కి ఈ రకం వజ్రాలంటే ప్రత్యేకమైన ఇష్టమట. అందుకే ఆ కాలంలో రాజవంశాల్లో పోట్రెయిట్ కట్ రింగ్స్ ప్రత్యేక గుర్తింపును సంపాదించాయి.
పోట్రెయిట్ కట్ గా పిలిచే ఈ డిజైన్ ను స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా భావిస్తారట. పోట్రెయిట్ కట్ రింగ్ తయారీలో వజ్రాన్ని సాధారణంగా కట్ చేయరు. దాన్ని పలుచని గాజు పలకలా కనిపించేలా ప్రత్యేక పద్ధతిలో కట్ చేసి సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ చాలా మందికి అందని లగ్జరీ. అందుకే ఈ రకం రింగ్స్‌ను అరుదుగా మాత్రమే తయారు చేస్తారు. సమంత రింగ్ కూడా అలాంటి రేర్ పీస్‌నే. ఇక కాస్ట్ విషయానికి వస్తే.. సమంత ధరిస్తున్న ఆ పోట్రెయిట్ కట్ వజ్రపు రింగ్ ప్రస్తుత మార్కెట్లో దాదాపు రూ. 1.5 కోట్లు విలువచేస్తుంది. ఇది తెలుసుకున్న నెటిజన్లకు ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి. మొత్తానికి కట్‌కి ఉన్న కింగ్‌లీ టచ్… రేర్ వాల్యూ… శతాబ్దాల చరిత్ర.. ఇవన్నీ సామ్ వెడ్డింగ్ రింగ్‌ను నిజంగానే రాయల్ రారేటీగా నిలబెట్టాయి.