ఏపీ మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు ట్రోలర్లకు పండగే. జగన్ ప్రెస్ మీట్ పెట్టినా, రికార్డెడ్ వీడియో రిలీజ్ చేసినా....ఆయన నోటి నుంచి జాలువారే ఆణిముత్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా పరకామణి హుండీ లెక్కింపు సందర్భంగా జరిగిన దొంగతనం గురించి మాట్లాడుతూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి అద్దం పడుతున్నాయి. 72 వేల రూపాయల విలువైన 9 అమెరికన్ డాలర్లు చోరీ అయ్యాయని, అది పెద్ద విషయం ఏమీ కాదని జగన్ చెప్పడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం ఆయన స్థాయికీ తగదు...మాజీ ముఖ్యమంత్రి పదవికి అస్సలు తగదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తన డ్రైవర్ ను మర్డర్ చేసి వారి ఇంటికే డోర్ డెలివరీ చేసిన అనంత బాబు వంటి నేతలను ఎంకరేజ్ చేసిన జగన్ కు పవిత్రమైన దేవాలయంలో పరకామణి హుండీలో జరిగిన చోరీ చిన్నదే అనిపించడం సహజమనేనని మరికొందరు చురకలంటిస్తున్నారు.