బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. `అఖండ 2` ద్వారా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అయ్యారు. కానీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కోసం రెడీగా ఉన్న ఈ సినిమా… చివరి నిమిషంలో హైకోర్టు ఆర్డర్స్‌తో ఆగిపోవడం ఇండస్ట్రీలో భారీ చర్చనీయాంశమైంది. బాలయ్య కెరీర్‌లో ఇలా రిలీజ్‌కు గంటల ముందు బ్రేక్ పడటం ఇదే తొలిసారి.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. గతంలో మహేష్ బాబు సినిమాలు ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ నిర్మాణ సమయంలో 14 రీల్స్ (ప్రొడ్యూసర్లు రామ్ ఆచంట, గోపీ ఆచంట) మరియు ఎరోస్ ఇంటర్నేషనల్ మధ్య భారీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఆ సినిమాలు డిజాస్టర్ కావడంతో ఎరోస్‌కు భారీ నష్టాలొచ్చాయి. దాంతో ఎరోస్ కు 14 రీల్స్ నిర్మాతలు రూ. 27 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు పెండింగ్‌లో ఉండగానే, 14 రీల్స్ వాళ్లు తమ కొత్త బ్యానర్ అయిన 14 రీల్స్ ప్లస్ పేరుతో అఖండ 2 ను నిర్మించారు.
ఈ చర్య ఎరోస్‌ను రెచ్చగొట్టింది. సరిగ్గా రిలీజ్ టైమ్‌కు పాత బకాయిలు క్లియర్ చెయ్యకుండా కొత్త బ్యానర్ పెట్టి పెద్ద సినిమా రిలీజ్ చేస్తున్నారంటూ ఎరోస్ మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు రిలీజ్‌పై స్టే విధించింది. చివరి 48 గంటల్లో రామ్ ఆచంట, గోపీ ఆచంట సహా పలువురు పెద్దలు చర్చలు జరిపినా… అమౌంట్ పెద్దది కావడంతో సెటిల్మెంట్ సాధ్యం కాలేదని ఇండస్ట్రీ బజ్. మధ్యవర్తులు కూడా ప్రయత్నించినా లాభం లేకపోయిందట. ఫలితంగా డిసెంబర్ 5న రావాల్సిన అఖండ 2 అకస్మాత్తుగా ఆగిపోయింది.
ఇక కోర్టు ఆర్డర్స్ రాకుండా అఖండ 2 కదలదు అనేది క్లియర్. కానీ అదే సమయంలో రిలీజ్‌ను ఎక్కువ రోజుల పాటు పుష్ చేయాలన్న ఉద్దేశం ప్రొడ్యూసర్లకు లేదు. అందుకే లైన్లో మూడు రిలీజ్ డేట్లను హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం. చర్చలు ఫలించి వివాదం క్లియర్ అయితే డిసెంబర్ 12, డిసెంబర్ 19, డిసెంబర్ 25 ఈ మూడు తేదీల్లో ఏదో ఒకటిని లాక్ చేసే పనిలో టీమ్ బిజీగా ఉందట. ఒకవేళ కోర్టు క్లారిటీ ఆలస్యమైతే… జనవరి చివరి వారంలోనే సినిమా రిలీజ్ చేస్తారనే బ్యాకప్ ప్లాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.