అమెరికాలోని ఎన్నారైలకు ధన్యవాదాలు తెలిపేందుకు మంత్రి నారా లోకేశ్ ఈ నెల 6న డాలస్ లో ప్రత్యేకంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు డయాస్పొరాతో లోకేశ్ గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం కోసం భారీస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు లోకేశ్ ఈ రోజు రాత్రి అమెరికాకు బయలుదేరబోతున్నారు. లోకేశ్ అమెరికాకు వస్తూ వస్తూ ఎన్నారైల కోసం ఓ తీపి కబురు తెస్తున్నారు.
ప్రతి రోజు ఎన్నారైల దర్శనం కోటాను 100కు పెంచేందుకు టీటీడీ అంగీకరించింది. ఏపీఎన్నార్టీఎస్ ద్వారా ఎన్నారైలు తిరుమలలో వెంకన్నను దర్శనం చేసుకునేందుకు ప్రత్యేకంగా ఉన్న కోటాను తాజాగా 100కు పెంచారు. దీంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు లోకేశ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. రేపు జరగోయే లోకేశ్ గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం కోసం భారీ సంఖ్యలో ఎన్నారైలు డాలస్ కు తరలివస్తున్నారు.