తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు)కుదుర్చుకుంది. తెలంగాణ ఫ్యూచర్ కు ఎంతో కీలకమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న ఈ సదస్సులో డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ తోపాటు పలు రంగాల్లో అనేక కంపెనీలు పెట్టుబడుటు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
డీప్ టెక్నాలజీ రంగంలో రూ.75 వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.27 వేల కోట్లు, పునరుత్పాదక రంగంలో రూ.39,700 కోట్లు, ఏరోస్పోస్, డిఫెన్స్ రంగాల్లో రూ.19,350 కోట్లు, ఏవియేషన్ రంగంలో జీఎంఆర్ గ్రూపుతో రూ.15 వేల కోట్లు, తయారీ రంగంలో రూ.13,500 కోట్లు, ఉక్కు రంగంలో రూ.7 వేల కోట్లు, టెక్స్‌టైల్స్ రంగంలో రూ.4 వేల కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.