ఇండిగోదే తప్పంటున్న చంద్రబాబు

admin
Published by Admin — December 09, 2025 in Andhra
News Image
ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంపై  సీఎం చంద్రబాబు స్పందించారు. ఇండిగో సంస్థ వైఫల్యం వల్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని చంద్రబాబు అన్నారు.
విమాన ప్రయాణికుల భద్రత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పైలట్లు, సిబ్బందికి తగినంత విశ్రాంతి కల్పించేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్‌డీటీఎల్) నిబంధనలను అమలు చేయడం సరైనదని అభిప్రాయపడ్డారు. .

ఆ మార్పులను ఇండిగో సంస్థ సరిగ్గా అంచనా వేసి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవడంలో విఫలమైందని  విమర్శించారు. సంస్థ తీరు వల్లే ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వచ్చింది దీంతో చదువుతున్నారు న్ఫవ్ణల. ప్రస్తుతం ఈ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు.
Tags
Indigo crisis cm chandrababu Indigo at fault Indigo flights
Recent Comments
Leave a Comment

Related News