ఏపీలో పెట్టుబుడులను ఆహ్వానించేందుకు ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ అమెరికా, కెనడాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంతర్జాతీయస్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీ (Celesta VC) మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్ తో శాన్ ఫ్రాన్సిస్కోలో లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి అనుకూల వాతావరణం ఇప్పుడు ఉందని వివరించారు.
విశాఖ నగరం ఐటీ, డేటా హబ్ గా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని. ఏపీలో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నొవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. సెమీ కండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. లోకేశ్ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించిన అరుణ్ కుమార్...వాటిని పరిశీలిస్తామని అన్నారు. ఈ రోజు మరి కొందరు పారిశ్రామికవేత్తలను లోకేశ్ కలవబోతున్నారు.