ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం కెప్టెన్ స్మృతి మంధాన ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తర్వాత చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా… పలాష్ ముచ్చల్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అందుకు ఆమె రీజన్స్ ఆమెకు ఉండొచ్చు.. కానీ ఇప్పుడు స్మృతి బాటలో ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు నివేదా పేతురాజ్.
ఆగస్టులో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్ తో నివేదా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ ఫోటోలు ఆమె స్వయంగా షేర్ చేస్తూ `న్యూ చాప్టర్` అంటూ ఫ్యాన్స్‌తో సెలబ్రేట్ చేసుకుంది. రేపో మాపో వీరిద్దరి పెళ్లి జరగడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నివేదా ఆ ఎంగేజ్మెంట్ ఫోటోలు అన్నీ ఇన్‌స్టాగ్రామ్ నుండి డిలీట్ చేయడమే కాదు, రజత్‌ను అన్‌ఫాలో చేసింది. అటు రజిత్ సైతం అదే పని చేశాడు.
సెలబ్రిటీలు బ్రేకప్ తర్వాత మొదట చేసే పని.. సోషల్ మీడియాలో అన్‌ఫాలో అవడం, కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయడం. అదే పద్ధతిని నివేదా ఫాలో చేయడంతో ప్రియుడితో ఆమె పెళ్లి క్యాన్సిల్ అనే ప్రచారం ఊపందుకుంది. నివేదా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. అయితే సోషల్ మీడియా యాక్షన్ చూస్తే మాత్రం మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నిజమే అన్న సందేహం బలపడుతోంది.