మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అీయ్యారు.18 నెలలు గడిచినా మంత్రుల పనితీరులో ఎటువంటి మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరు మార్చు కోవాలేని సున్నితంగా హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షల ప్రకారం పథకాలలో మార్పులు చేర్పులు ఉంటాయని చంద్రబాబు అన్నారు. ప్రతి శాఖ చేసిన పనులన్నీ తన దగ్గర రికార్డు ఉందని చెప్పారు. పథకాల అమలు వంటి అంశాలపై ఈరోజు సచివాలయంలో జరిగిన సమీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో కరువు తీర్చేందుకు ఇజ్రాయిల్ టెక్నాలజీ ఉపయోగించుకున్నామని గుర్తు చేశారు.
దేశంలోనే తొలిసారిగా అనంతపురం రైతులకు వేరుశనగ పంటకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామని చెప్పారు. సౌర శక్తి వినియోగించుకుంటే విద్యుత్ డిమాండ్ బాగా దక్కుతుందని చంద్రబాబు అన్నారు. అన్నా హజారే స్ఫూర్తితో జల సంరక్షణ చేపట్టామని, రాయలసీమలో ఇప్పుడు భూగర్భ జలాలు పైకి వచ్చాయని చెప్పారు. సీమలో మూడు మీటర్లకు భూగర్భ జలాలు చేరితే వ్యవసాయం కోసం ఖర్చుపెట్టే బడ్జెట్ తగ్గుతుందన్నారు. ఒకప్పుడు రాయలసీమలో పశువులకు గడ్డి కూడా దొరికే పరిస్థితి ఉండేది కాదని, ఇప్పుడు నాణ్యమైన వేరుశనగ పండుతోందని అన్నారు. ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని దిశా నిర్దేశం చేశారు.