టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత డిసెంబర్ 1న దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కోయంబత్తూరులో సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది. గత కొంత కాలం నుంచి రిలేషన్ లో ఉన్న రాజ్-సామ్ ఫైనల్‌గా మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. రాజ్ మన తెలుగోడే. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో 1975 రాజ్ జన్మించారు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ కంప్లీట్ చేసిన ఆయన.. అమెరికాలో కొన్నాళ్లు సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేశారు. అయితే సినిమాల పట్ల మక్కువతో ఫిల్మ్ మేకింగ్‌లోకి అడుగుపెట్టారు. రాజ్ నిడిమోరు ఒక ప్రఖ్యాత చిత్రనిర్మాత, రచయిత మరియు దర్శకుడు. కృష్ణ డికెతో కలిసి `రాజ్ & డికె` అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. `ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ ద్వారా రాజ్, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా వృత్తిపరమైన బంధం వ్యక్తిగత అనుబంధంగా మారింది.
అయితే సినీ ప్రేమికులకు రాజ్ నిడిమోరు దర్శకుడిగా బాగా సుపరిచితం. తెలివైన కథలు, విభిన్నమైన టేకింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయనలో మరో టాలెంట్ దాగి ఉంది. నిజానికి ఆయన మంచి సింగర్ కూడా. తాజాగా రాజ్ పాడిన ఒక డివోషనల్ సాంగ్ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది. ఆయన వాయిస్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. వీడియో చూసిన నెటిజన్లు `దర్సకుడే కాదు.. గాయకుడిగా కూడా రాజ్ టాప్‌కు వెళ్లొచ్చు` అని కామెంట్ చేస్తున్నారు. మరీ కొందరు మెచ్చుకుంటూ.. “సమంతను తన స్వీట్ వాయిస్‌తోనే ఇంప్రెస్ చేసేశాడేమో!” అంటూ సరదాగా స్పందిస్తున్నారు. మొత్తానికి రాజ్ సింగింగ్ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
https://www.instagram.com/reel/DSCxfTQkxty/?utm_source=ig_web_copy_link