దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రపథాన నిలుపుతామని, రాష్ట్రంలో ఏఐ విప్లవాన్ని తీసుకువ స్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి.. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో ని సిలికాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ఏఐ యూనివర్సిటీని ఏపీలో నిర్మిస్తున్నామన్నారు. దీనికి సహకరించాలని ఐటీ పారిశ్రామిక వేత్తలను కోరారు.
ఈ సందర్భంగా ఏపీ విజన్‌ను ఆయన ఆవిష్కరించారు. ఏఐ యుగంలో నైపుణ్యాలు, విశ్వాసం, రంగాల మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై స్పందిస్తూ.. దేశంలో విజన్‌ను ఆధారంగా చేసుకుని దూసుకుపోతున్న తొలిరాష్ట్రం ఏపీనేనని చెప్పారు. ప్రస్తుతం ఏపీ 180 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందన్నారు. భవిష్యత్ లో ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల(24 లక్షల కోట్ల రూపాయలు) ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పేర్కొన్నారు.
అదేసమయంలో ప్రస్తుతం 12.8 శాతంగా ఉన్న వృద్ధిని రాబోయే మూడేళ్లలో 15 శాతం వృద్ధికి తీసుకువెళ్తా మని లోకేష్ చెప్పారు. ప్రజలు , పెట్టుబడి దారుల భాగస్వామ్యంతో ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. ము ఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు విజన్2047 దీనికి దోహద పడనుందని వివరించారు. క్లస్టర్ విధానం లో అభివృద్ధిన ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆటోమోటివ్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, సీబీజీ, ఓట్స్, ఆక్వా, ఏఐ వంటి దాదాపు 20 రంగాలను గుర్తించినట్టు తెలిపారు.
ఇంటికో పారిశ్రామిక వేత్తతోపాటు.. ప్రతి కుటుంబం నుంచి ఏఐ నిపుణులు ఉండేలా సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు వివరించారు. ఈ నేపథ్యంలోనే గుర్తించిన రంగాలను క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేస్తామని వివరించారు. ఎకో సిస్టమ్ ను కల్పిస్తామన్నారు. కియా గ్లోబల్ ఉత్పత్తిలో 9 శాతం ఏపీ నుంచే వస్తోందని వివరించారు. రాబోయే రోజుల్లో గూగుల్ డేటా సెంటర్ కీలక పాత్ర పోషించనుందని లోకేష్ వివరించారు.