ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్నారు. మొత్తం ఐదు రోజుల పర్యట నలో ఆయన కెనడాలోనూ పర్యటిస్తారు. అయితే.. తొలిరోజు డాలస్‌లో ప్రవాస భారతీయులను కలుసుకు న్న తర్వాత పెట్టుబడి దారులతో భేటీ అవుతున్నారు. అనేక కంపెనీలతో లోకేష్ చర్చలు జరుపుతున్నా రు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను.. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను కూడా చెబుతు న్నారు. తద్వారా ఏపీకి రావాలని కోరుతున్నారు.
బాబును గుర్తు చేస్తూ..
సీఎం చంద్రబాబు కూడా.. 1995లో ముఖ్యమంత్రి అయిన.. తర్వాత ఏపీని డెవలప్ చేసేందుకు ఎంచుకు న్న తొలి దేశం.. అమెరికానే. అక్కడే బిల్ గేట్స్ సహా.. అనేక మందితో భేటీ అయ్యారు. పెట్టుబడులను కూడా ఆహ్వానించారు. ఆ తర్వాత కూడా.. పలుమార్లు అమెరికాలో పర్యటించారు. ఇప్పుడు అదే పరంపర ను మంత్రి నారా లోకేష్ కొనసాగిస్తుండడం గమనార్హం. పెట్టుబడుల విషయంలో ప్రతి విషయాన్నీ సీరి యస్‌గా తీసుకుంటున్న నారా లోకేష్.. తండ్రి బాటలో నడుస్తున్నారు.
అంతేకాదు.. ఇటీవల కాలంలో పర్యటనలను పక్కన పెడితే.. చంద్రబాబు గతంలో విదేశాలకు వెళ్లినప్పు డు.. తన పనులు తానే చేసుకునేవారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా తన పనులు తానే చేసుకుంటూ తండ్రికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అప్పట్లో చంద్రబాబును వెయిట్ చేయించిన ప్రముఖులు ఉన్నారు. కానీ, ఇప్పుడు అలా లేకపోయినా.. తక్కువ సమయం కేటాయిస్తున్నారు. అయినప్పటికీ నారా లోకేష్.. ఆ తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలను పంచుకుంటున్నారు.
మొత్తంగా నారా లోకేష్.. గతంలో చంద్రబాబు చేసినట్టుగానే విదేశీ యాత్రలు చేస్తూ.. పెట్టుబడులు తీసు కువస్తున్నారు. ఇది ఆయనకు జాతీయంగానే కాకుండా.. లోకల్‌గా కూడా.. మంచి గుర్తింపు తీసుకువస్తుం డడం గమనార్హం. సో.. మొత్తంగా ఈ వ్యవహారంలో మంత్రి నారా లోకేష్ మంచి మార్కులు వేయించుకుం టున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా సింగపూర్ సహా పలు దేశాల్లో పర్యటించి.. పెట్టుబడులు దూసుకువచ్చా రు. ఎప్పటికప్పుడు లక్ష్యాలు మార్చుకుంటూ ఏపీ అభివృద్దిపై దృష్టి పెడుతున్నారు.