జగన్ ఫ్యూచరేంటి? ఇప్పుడున్న పరిస్థితి కొనసాగుతుందా? ముందు ముందు పుంజుకుంటారా? లేక.. మరింతగా గ్రాఫ్ దిగజారుతుందా? అంటే.. దిగజారుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి.. పార్టీని నిలబెట్టుకోవడం కష్టమేనన్న వాదన కూడా వినిపిస్తోంది. నేరుగా ప్రధాన మంత్రే.. బీజేపీని డెవలప్ చేసేందుకు నడుం బిగించిన నేపథ్యంలో వైసీపీ పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలోకి పడిన చందంగా మారనుందని అంటున్నారు పరిశీలకులు.
ముఖ్యంగా పార్టీలోనూ అంతర్గత కలహాలు పెరుగుతున్నాయి. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో నాయకుల మధ్య కలివిడి అత్యంత అవసరం. కానీ, క్షేత్రస్థాయిలో ఆ తరహా పరిస్థితి కనిపించడం లేదు. నాయకు ల మధ్య వివాదాలను సరిదిద్దే యంత్రాంగం కూడా కనిపించడం లేదు. అసలు అధిష్టానంపైనే ఆరోపణ లు రావడం.. నాయకులకు ఇబ్బందిగా మారుతోంది. ఎవరిని ఏ విషయంలో కదిలించినా.. జగన్ చెప్పారు కాబట్టే అక్రమాలు చేశామని చెబుతున్నారు.
దీనిలో నిజం ఏంటనేది ఇప్పటికీ తెలియడం లేదు. అక్రమ మద్యం కేసు కావొచ్చు.. తిరుమల వ్యవహారా లు కావొచ్చు.. ప్రజల సెంటిమెంటును బాగా దెబ్బతీశాయి. దీనికితోడు కనీసం రహదారుల నిర్మాణం కూడా చేయలేక పోయారన్న వాదన బలంగా ప్రజల్లో ఇప్పటికీ ఉంది. వైసీపీ మళ్లీ వస్తే.. ఇబ్బందులే అనే టాక్ ఇప్పటికీ గ్రామాల్లోనూ వినిపిస్తోంది. ఇది, ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామంగా అయితే మారుతోంది. ఈ విషయాలపై ఇప్పటి వరకు క్లారిటీ కూడా లేకుండా పోయింది.
జగన్ బయటకు వచ్చినా.. ఇప్పటికీ స్క్రిప్టు చూసి చదువుతున్నారు. అందులోనూ తప్పులు దొర్లుతున్నా యి. బలమైన వాయిస్ వినిపించే వారు కూడా కనిపించడం లేదు. ఇప్పుడు మారుతున్న రాజకీయ వ్యూహా లకు అనుగుణంగా ప్రతివ్యూహాలు సిద్ధం కావడం లేదు. `అంతా ప్రజల చిత్తం` అని జగన్ చెబుతున్నారు. కానీ, పార్టీ పరంగా ఆయన ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం లేదు. అందరినీ కలుపుగోలుగా పలక రించడం కూడా లేదు. సో.. ఇవన్నీ వైసీపీకి పెను ఇబ్బందులు తెస్తున్నాయన్నది క్షేత్రస్థాయిలో టాక్. పైన ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనంగా ఉంటే.. అది ఎన్నికల సమయానికి ఇబ్బందులు తీసుకురావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.