తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తొలి విడతలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ రెండో దశలో కూడా జోరు కొనసాగిస్తోంది. రెండో దశ ఎన్నికల ఫలితాలలో ఇప్పటివరకు.కాంగ్రెస్ పార్టీ 1280 స్థానాలలో గెలుపొందింది. ఈ సారి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తోంది. 902 స్థానాల్లో విజయం సాధించింది. ఇక, బీజేపీ కేవలం 190 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 296 స్థానాల్లో విజయం సాధించారు.
రెండో విడత పోలింగ్ లో 193 మండలాల్లో 3911 గ్రామ పంచాయతీలకు, 29917 వార్డులకు పోలింగ్ జరిగింది. మూడో దశ ఎన్నికలు ఈ నెల 17న జరగబోతున్నాయి. మూడో దశలో 182 మండలాల్లోని 4159 పంచాయతీలు, 36452 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం మూడు దశల్లో కలిపి 12728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది.