జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగేంద్రబాబు (నాగబాబు) కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని ఆయన ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేదని, పార్టీ కార్యకర్తగా ఉండటంలోనే ఎక్కువ సంతృప్తి ఉందని అన్నారు. శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసేందుకు నాగబాబు అక్కడ పర్యటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఈ క్లారిటీనిచ్చారు.
ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే గత ఎన్నికల్లోనే చేసేవాడినని నాగబాబు అన్నారు. వచ్చే ఎన్నికల వరకు ఎందుకు ఆగాలి? అని ఆయన ప్రశ్నించారు. ఐదారేళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఎలా చెబుతాం? అని అన్నారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా కంటే జనసేన కార్యకర్తగా పిలిపించుకోవడానికే ఇష్టపడతానని అన్నారు.
2024 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని నాగబాబు భావించారు. అయితే, పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి దక్కింది. దీంతో, నాగబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.