ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి అరుదైన గౌరవం దక్కింది. మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ పురస్కారం బ్రాహ్మణిని వరించింది. బ్రాహ్మణికి ఈ పురస్కారాన్ని ప్రముఖ వ్యాపార మ్యాగజైన్ 'బిజినెస్ టుడే' అందించింది. వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తున్న మహిళల నాయకత్వ పటిమను, సంస్థల అభివృద్ధిలో వారి పాత్రను గుర్తించి ఈ అవార్డును ఇస్తారు.
హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ విస్తరణ, బ్రాండ్ విలువను పెంచడం, బ్రాహ్మణి నాయకత్వ పటిమ వల్ల ఆమెకు ఈ పురస్కారం దక్కింది. హెరిటేజ్ అభివృద్ధిలో బ్రాహ్మణి తనవంతు పాత్ర పోషించారు. మార్కెట్ అవసరాలకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకుంటూ, టెక్నాలజీ సాయంతో సంస్థ పురోగతికి బ్రాహ్మణి దోహదపడ్డారు. అందుకు గుర్తింపుగానే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ఆమెకు దక్కింది.
తన అర్ధాంగికి దక్కిన గౌరవంపై, ఆమె అందుకున్న పురస్కారంపై లోకేశ్ స్పందించారు. "భర్తగా గర్విస్తున్నాను. మాటల కన్నా పనితోనే సమాధానం చెప్పడం, నిశ్శబ్దంగా సంస్థలను నిర్మించడం బ్రాహ్మణి నాయకత్వ పటిమకు నిదర్శనం" అని లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.