సీఎం రేవంత్ రెడ్డి హనీమూన్ పీరియడ్ ముగిసిపోయిందని, కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ రోజు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరగబోతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారని ఆయన వెల్లడించారు.
రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటారో తనకు తెలియదని, తాను మాత్రం రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ ఆడుకుంటానని కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. తాను ఫెయిల్యూర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కామెంట్ చేసిన రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా 32 జిల్లా పరిషత్‌లు, 136 మున్సిపాలిటీలను గెలిచామని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 7 ఉప ఎన్నికలు నిర్వహిస్తే అన్నింటిలో ఓడిపోయారని గుర్తు చేశారు. సొంత పార్లమెంటు స్థానాన్ని కూడా గెలిపించలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. తాను ఐరన్ లెగ్ కాదని, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలే ఐరన్ లెగ్‌లు అని విమర్శించారు.