ఏపీ సీఎం చంద్రబాబు భారీ టార్గెట్ పెట్టుకున్నారు. వాస్తవానికి ఆయన పెట్టుకున్న టార్గెట్ కొత్తదికాదు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు గతంలోనే పెట్టుకున్న లక్ష్యం. కానీ, ఆయా రాష్ట్రాలు వాటిని ఛేదిం చలేక పోయాయి. దీంతో కొంత మేరకు పనిచేసి తర్వాత వదిలేశారు. అయితే.. ఇప్పుడుఏపీ ముఖ్యమం త్రిగా చంద్రబాబు ఈ నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తానని.. అందరూ కలసి రావాలని సూచించారు. అదే.. వచ్చే ఏడాది జూన్ నాటికి `ప్లాస్టిక్ రహిత ఏపీ`గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం.
లక్ష్యం బాగానే ఉన్నా.. దీనిని సాధించడం అంత తేలికకాదన్నది గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత రాష్ట్రంలో ప్లాస్టిక్ ఇండస్ట్రీపై ఆధారపడి 70 లక్షల మంది ఉపాధి పొందుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ, ఇది పక్కా వాస్తవం. విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి వంటి ప్రధాన నగరాలు.. ప్లాస్టిక్ ఉత్పత్తిలో ముందు వరసలో ఉన్నాయి. పెద్ద ఎత్తున కర్మాగారాలు నడుస్తున్నాయి. వేల మందికి ఉపాధి, వ్యాపార అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. తద్వారా అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి.
ప్లాస్టిక్ గ్లాసులు, సంచులు, ప్లేట్లు, స్పూన్లు, సీసాలు.. ఇలా.. ఒకటి కాదు.. అనేక రూపాల్లో ప్లాస్టిక్ ఉత్పత్తు లు నేడు పెరుగుతున్నాయి. గత 20 ఏళ్ల కాలంలో ప్లాస్టిక్ వినియోగం ఏపీలో 150 శాతం మేరకు పెరిగిందం టే.. ఆశ్చర్యం వేస్తుంది. ఇది ప్రభుత్వమే చెప్పిన లెక్క. ఎక్కడికి వెళ్లినా.. ప్లాస్టిక్ సంచులే దర్శనమిస్తు న్నాయి. ఇక, గ్లాసులకు కొదవే లేదు. మొత్తంగా ఈ పరిశ్రమ వేళ్లూనుకుంది. సుమారు 70 లక్షల మంది వీటిపై ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి.. ఇప్పుడు చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యం ఏమేరకు సాకారం అవుతుందన్నది ప్రశ్న.
సీఎం చెబుతున్నట్టు ప్లాస్టిక్ రహిత ఏపీగా తీర్చిదిద్దాలంటే.. ఈ కర్మాగారాలను మూసేసి.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. ఈ రేంజ్‌లో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? అనేది ప్రశ్న. అంతేకాదు.. 70 లక్షల మందిలో సగం మందికి ఉపాధి చూపించే మార్టాలు లేవు. అంతేకాదు.. వ్యాపారాలు.. కూడా దెబ్బతింటే.. మరింత మందికి నష్టమే. కానీ.. లక్ష్యం బాగానే ఉంది. ప్లాస్టిక్‌రహితంగా చేయాలన్నది నిర్దేశిత లక్ష్య సాధనకు సూచనే.
గతంలో మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌లో ఈ ప్రయత్నం చేశారు. కానీ, తర్వాత.. నెమ్మది నెమ్మదిగా విరమించారు. సో.. ఈ లక్ష్యం బాగానే ఉన్నా.. దీనికి అనుసంధానంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాలి. ఉపాధి, ఉద్యోగాలు దెబ్బతింటే.. మరింత ప్రమాదం. సో.. ప్రకటన కాదు.. కార్యాచరణ, కీలక పరిణామాలపై దృష్టి ఇప్పుడు అత్యంత అవసరం.